తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ అలర్ఠ్ గా ఉండాలని పేర్కొంది వాతావరణ శాఖ.
ఇక ఇది ఇలా ఉండగా.. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, సెక్రటేరియట్, లకిడికపూల్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ తరుణంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు.. గాలి గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో పాటు వాడగళ్లుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.