ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి.. ఒక్కో పథకం ఒక్కో పెన్షన్ ను అందిస్తుంది.. అందులో పెట్టుబడిని బట్టి పెన్షన్ వస్తుంది.. అలా ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్ లు ఎన్నో అందిస్తుంది.. అందులో నేషనల్ పెన్షన్ సిస్టం కూడా ఒకటి..ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల తీసుకోవచ్చు.. ఇప్పుడు ఎవరైనా NPS పెట్టుబడి నుండి నెలకు 75 వేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందాలనుకుంటే, ఎంత డబ్బు డిపాజిట్ చేయాలి?దీని కోసం ఎన్‌పిఎస్‌లో మొత్తం డిపాజిట్ రూ.3.83 కోట్లు ఉండాలి.ఎన్‌పిఎస్ మొత్తం మూలధనంలో 40 శాతం యాన్యుటీని కొనుగోలు చేయడం కోసం వెచ్చిస్తున్నారని అనుకుందాం.
ఈ స్కీమ్ నుండి సంవత్సరానికి 6 శాతం వడ్డీని పొందవచ్చు.. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు విరంగా తెలుసుకుందాం.. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎప్పుడు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారనే దానిపై ఆధారపడి ఉంటాయి. ముందుగానే ప్రారంభించడం మరియు క్రమం తప్పకుండా పొదుపు చేయడం వలన భారీ పదవీ విరమణ నిధి ఏర్పడుతుంది.. ఒక వ్యక్తికి ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి వచ్చే 35 ఏళ్లపాటు NPSలో నెలకు రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడనుకుందాం.10 శాతం వార్షిక రాబడిని ఊహిస్తే అతనికి 3,82,82,768 వద్ద ఉంటుంది. ఇప్పుడు అతను యాన్యుటీని కొనుగోలు చేయడానికి 40 శాతం ఖర్చు చేస్తే, పదవీ విరమణ తర్వాత అతనికి నెలకు రూ.76 వేల పెన్షన్ వస్తుంది.. ఇది బెస్ట్ స్కీమ్ లలో ఒకటి..