Telangana :ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్ షాప్‌లు

-

రైతు భరోసా పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న అంశంపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నది.

 

రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై ప్రభుత్వం వర్క్ షాప్‌లు నిర్వహించనున్నది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను ఆచరణలోకి తీసుకోనున్నారు. 10న ఖమ్మం. 11,అదిలాబాద్, 12 మహబూబ్‌నగర్, 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి ఆయా జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాపులు నిర్వహించనున్నది.ఈ సమావేశాలకు మేధావులు,రైతులు, రైతు సంఘాలను సమీకరించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఉప సంఘం చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news