ఎట్టకేలకు టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్ నేమ్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది.భారత మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా గంభీర్ పేరును బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు.
ఆయనకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్ను గంభీర్ దగ్గరగా చూశారు. తన కెరీర్లో ఎన్నో విభాగాల్లో రాణించి భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేలా ఎంతో కృషి చేశారు అని అన్నారు. గంభీర్ పై నాకు నమ్మకం ఉంది. గంభీర్ కొత్త ప్రయాణానికి బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది’ అని షా వెల్లడించారు.కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం జూన్ 30తో ముగిసిన విషయం తెలిసిందే.