నీళ్ళ పంచాయతీ.. కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ.

-

కృష్ణా నది నీటి పంచాయతీ అంతకంతకూ పెరుగుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో, కావాల్సిన దాని కంటే ఎక్కువ నీళ్ళు తెలంగాణనే వాడుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుందని ప్రత్యారోపణలు వచ్చాయి. అదీగాక తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాబోర్డును కోరింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్టాబోర్డుకు లేఖ రాసింది.

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించబడింది. 1959లోనే విద్యుత్ ప్రాజెక్టుగా అప్పటి ప్లానింగ్ కమీషన్ అనుమతులు ఇచ్చింది. విద్యుత్ ఉత్పత్తికి తప్ప మరో దానికి నీటిని విడుదల చేయొద్దని 1963లోనే నిర్ణయించారని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణ ప్రతిపక్షా నాయకులు మాత్రం, నీళ్ళ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే తప్పు చేసిందని, ఆంధ్రప్రదేశ్ తో అనవసర ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news