బంధం: మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ ఆలోచనలు పంచుకోవద్దు.

-

ఏ బంధంలో అయినా అన్నీ పంచుకుంటేనే బాగుంటుంది అని అందరూ చెబుతుంటారు. భార్యాభర్తల బంధంలో ఇది ఖచ్చితం అనే వారు ఉన్నారు. కానీ, అన్ని ఆలోచనలూ పంచుకోవడం అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. కొన్ని మీతో పాతే ఉంచుకోవాలి. అలాంటివి ఏంటీ తెలుసుకుని భాగస్వామితో ప్రశాంతమైన జీవనాన్ని గడపండి.

చిన్న చిన్న బాధించే ఆలోచనలు

మీ భాగస్వామి చేసే రోజువారి పనుల్లో కొన్ని మీకు కోపం తెప్పిస్తుండవచ్చు. అలాగే కొన్ని బాద్హిస్తుండవచ్చు. మీ బంధం బలంగా ఉందనుకున్నప్పుడు అలాంటి వాటిని మీ భాగస్వామితో పంచుకోవద్దు. అనవసరంగా మీ భాగస్వామిని గాయపర్చిన వారవుతారు.

గత ప్రేమల ఆలోచనలు

పెళ్ళి చేసుకుని వేరొకరితో జీవనం కొనసాగిస్తున్నప్పటికీ, కొన్ని కొన్ని సార్లు గత స్నేహాల ఆలోచనలు గుర్తొచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇలాంటి వాటిని పొరపాటున కూడా భాగస్వామితో పంచుకోవద్దు. దానికోసం ప్రత్యేకమైన స్నేహితులను వెతుక్కోవడం ఉత్తమం.

భాగస్వామ్ని కుటుంబం గురించి

మీ బంధానికి, కుటుంబానికి బీటలు వారుతాయన్న సందర్భాలలో తప్ప, అవతలి వారి కుటుంబం గురించి మీ భాగస్వామితో పంచుకోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వారి కుటుంబాన్ని కించపరిచినట్టుగా మాట్లాడకుండా ఉండండి.

భాగస్వామి స్నేహితుల పట్ల ఆకర్షణ

అవతలి వారి స్నేహితుల గురించి చిన్న చిన్న విషయాల్లో అయినా సరే పొగడ్తలకి పోవద్దు. అది మీ బంధానికి మంచిది కాదు. ఆ ఆకర్షణ గురించి మీ భార్యా/భర్తతో అస్సలు పంచుకోవద్దు.

అనుమానం కలిగినపుడు

ఖచ్చితంగా మీకు తెలిస్తే తప్ప నోటి దూలకి అస్సలు వాగేయవద్దు. అనుమానం పెనుభూతం నిజమే కానీ, తెలుసుకోకుండా మాట్లాడకండి.

Read more RELATED
Recommended to you

Latest news