నేడు రాష్ట్రానికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం

-

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇవాళ హైదరాబాద్ చేరుకోనుంది. ఈనెల 3వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు ఈ బృందం వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 11 రోజుల తర్వాత వీళ్లు రాష్ట్రానికి వస్తున్నారు. మొదట అమెరికా వెళ్లిన రేవంత్ టీమ్ అక్కడ పలు బహళజాతి సంస్థల ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించింది. అలా అమెరికా పర్యటనలో మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకవచ్చింది.

ఆ తర్వాత ఈ బృందం దక్షిణ కొరియాలోని సియోల్లో పర్యటించింది. గత రెండు రోజులుగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించింది. హ్యుందాయ్ మోటార్స్, కొరియా టెక్స్ టైల్ పరిశ్రమల సమాఖ్య, ఎల్ఎస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక సియోల్ నుంచి సింగపూర్ వెళ్లిన ఈ బృందం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకోనుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి రాష్ట్ర నేతలు స్వాగతం పలకనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version