తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

-

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న తొమ్మిది మందికి పదోన్నతి కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం వారు పని చేస్తున్న బాధ్యతలను యధావిధిగా ఉంటాయని.. కానీ వారి హోదాలు మాత్రం పదోన్నతుల ప్రకారం.. ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ హోంగార్డు విభాగం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర అదే హోదాలో ఉంటారని.. కానీ ఆయన పదోన్నతి మాత్రం పే మాట్రిక్స్ 15 కేటగిరిలోకి వెళ్తుందని పేర్కొన్నారు.

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీకేయ 2006 బ్యాచ్ తో పాటు మరో ఐదుగురు స్టేట్ సర్వీస్ నుంచి ఐపీఎస్ లుగా గుర్తింపు పొందిన రమేష్ నాయుడు, ఏపీ రంగనాథ్, వీ.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు ఐజీలుగా పదోన్నతి పొందినట్టు సీఎస్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇద్దరూ డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్ ఆఫీసర్లు నేలకొండ ప్రకాశ్ రెడ్డి, డి.జోయల్ డేవిస్ ఇద్దరూ 2010 బ్యాచ్ డీఐజీలుగా పదోన్నతి పొందినట్టు సీఎస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news