జనసేన లిస్ట్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు

-

జనసేన అధినేత పవన్ కల్యాన్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కనీసం 15 శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. తీసుకున్న 24 సీట్లలో నాలుగు కూడా గెలవలేరని సెటైర్లు వేశారు. జనసైనికుల ఆశయాలను చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఆయన పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కూటమి ఓడిపోతుందని అనిల్ కుమార్ తెలిపారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కారణం అని.. చంద్రబాబు రాజకీయాల నుంచి ఇక తప్పుకుంటారని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు. రాజానగరంలో జనసేన అభ్యర్థి పై జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news