హైదరాబాద్ మహానగరంలో… రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా హైదరాబాద్ మహానగరంలో ఇలా అమ్మకాలలో 42 శాతం డౌన్ ఫాల్ అయిందని.. సమాచారం. గతంలో ఎన్నడు లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైందని చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా ఇదే విషయాన్ని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ఫ్రాప్ ఈక్విటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
ఈ సంస్థ లెక్కల ప్రకారం… జులై నుంచి సెప్టెంబర్ నెలలో సుమారు 42 శాతం మేర తక్కువగా ఇండ్లు విక్రయాలు జరిగాయని… తెలిపింది. ఇక ఇప్పటికే 12, 082 యూనిట్ల విక్రయాలు జరిగి ఉండవచ్చని తెలిపింది. అయితే గత సంవత్సరం ఇదే సమయానికి 20 వేలకు పైగా యూనిట్లు… విక్రయాలు జరిగినట్లు తెలిపింది. అంటే దాదాపు 42 శాతం ఓవరాల్ గా… రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ఈ సంస్థ వెల్లడించింది.