హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నారు కిషన్ రెడ్డి

-

అపోలో హాస్పిటల్ దగ్గర హోంగార్డ్ లు  నిరసన చేపడుతున్నారు. పెద్ద ఎత్తున మొహరించారు హోంగార్డ్ లు. వి వాంట్ జస్టిస్, హోం గార్డ్ లకు న్యాయం చేయాలంటూ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హోం గార్డ్ ల శ్రమను దోచుకుంటున్నారు అని పేర్కొంటున్నారు.  ట్రాఫిక్ లో పని చేస్తున్న హోం గార్డ్ లు అనేక సార్లు స్పృహ తప్పి పడిపోయారు.

Asi నర్సింగ్ రావ్ పై చర్యలు తీసుకోవాలి, రవీందర్ చికిత్స కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  రవీందర్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం అని పేర్కొంటున్నారు. రవీందర్ ఆరోగ్య పరిస్తితి గురించి డాక్టర్లతో మాట్లాడాను. రవీందర్ కొలుకుంటాడని ఆశిస్తున్నానుఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదు.. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథం తో హోం గార్డ్ లకు మద్దతు తెలుపాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హోం గార్డ్ లకు అండగా నిలుస్తాం అని తెలిపారు.

సీఎం ఇచ్చిన మాట మీద నిలబడలేదన్నారు. ఇతర పోలీసుల మాదిరిగా  హోం గార్డ్ లకు గౌరవం ఇవ్వాలి . ఎవరూ కూడా అత్మహత్యలకు పాల్పడవద్దు అని సూచించారు. పోరాటం చేయండి కానీ ఆత్మ హత్య చేసుకోవద్దు.. ఆత్మ హత్యకు పాల్పడితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది అని తెలిపారు కిషన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news