పాతబస్తీలో ఎగిసిన నిరసన జ్వాల.. 100 మంది అరెస్టు

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ లో పెను దుమారం రేపాయి. పాతబస్తీలో రాజాసింగ్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిశాయి. రాజాసింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. చార్మినార్‌, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు  మరో 20 మందిని, తాజాగా షాలిబండ క్రాస్​రోడ్డులో ఆందోళన చేస్తున్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నుంచి షాలిబండలో 100 మందిని అరెస్టు చేశారు.

పాతబస్తీలోని పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. నేర విభాగ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షించారు.   పత్తర్ ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి ఆధ్వర్యంలో షాలిబండలో ర్యాలీకి బయల్దేరగా పోలీసులు అడ్డకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న 31మందిని ఆరెస్ట్ చేసి కంచన్ భాగ్ పీఎస్​కి తరలించారు.

ఇదే సమయంలో  మొఘల్ పురాతో పాటు మీర్ చౌక్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో వాటిని నమ్మొద్దని పోలీసులు తెలిపారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో  ర్యాలీగా వచ్చిన 20 మంది ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా షాలిబండ క్రాస్​రోడ్డులో ఆందోళన చేస్తున్న 50 మందిని అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నుంచి 100 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news