పదోతరగతి తొలుత ఫెయిల్.. రివాల్యేషన్ లో 90 శాతం మార్కులు..!

-

పదో తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురుతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్ లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్ కి చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్ గాందీనగర్లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.

ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్టపడ్డానని, 9.5 గ్రేడ్ సాధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యాన్ని నింపారు. తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్టు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట దాసిన పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్ 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రివాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కులు వచ్చాయి. 9.3 గ్రేడ్ తో ఉత్తీర్ణత సాధించింది. లతశ్రీ పేపర్ దిద్దిన ముగ్గురు ఎగ్జామినర్ల వల్ల పొరపాటు జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news