మనలోకం ప్రత్యేకం: అసెంబ్లీ భవనాన్ని కట్టి 116 ఏళ్ళు అయ్యింది మీకు తెలుసా…?

-

మన హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీ భవనాన్ని 1905వ సంవత్సరం జనవరి 25వ తేదీన అంకురార్పణ చేయడం జరిగింది. అసెంబ్లీ భవనం కట్టి ఈరోజు తో 116 సంవత్సరాలు అయింది దీనిని నిర్మించి ఒక శతాబ్దం పైనే పూర్తయింది అన్నమాట. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీ భవనాన్ని కట్టిన విధానం, ప్రత్యేకతలు ఇలా పలు విశేషాలు మీకోసం. ఈ అసెంబ్లీ భవనాన్ని కట్టి 116 ఏళ్ళు అయినా కూడా చెక్కు చెదరలేదు అంటే నిజంగా ఎంత గొప్పగా కట్టారో కదా..! నిర్మాణ శైలి గురించి చూస్తే… అతి అందమైన గోపురాలు ఆకాశాన్ని తాకే శిఖరాలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

మొగలాయి రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలుల తో దీన్ని కట్టించడం జరిగింది. గోపురాలూ కమాన్లు మొగలాయిల వాస్తు శైలిని సంతరించుకుంటే… గోడల పై వేసిన కళాత్మక దృశ్యాలు, లతలు డిజైన్లు అన్నీ కూడా రాజస్థానీ శైలి లో రూపొందించడం జరిగింది. ఈ శ్వేత సౌధాన్ని చూస్తే ఎంతటి వారైనా ముగ్ధులు అవ్వాల్సిందే. ప్రముఖులు, సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వేదిక లేదు అని 1905 లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు నగర వాసులు బహుమానంగా ఈ భావన నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

చందాలు పోగు చేసి మొత్తానికి ఎంతో శ్రమించి ఈ భవనాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ పచ్చని ప్రకృతి నడుమ ఈ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పట్లో కట్టించిన ఈ భవనం ఇప్పటికి కూడా ఒక అంచి వేదికగా ఉపయోగపడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news