తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. నేడు, రేపు మోస్తరు వర్షాలు ఉన్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని… దీంతో అక్టోబర్ వరకు వర్షాలు పడతాయని వెల్లడించింది.
మరోవైపు నిన్న పలు జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక అటు హైదరాబాద్ మహా నగరంలో గత మూడు రోజుల నుంచి ఉష్ణో గ్రతలు విపరీతంగా పెరిగి పోయాయి.