తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 13వ తేదీన ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి మే 14వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పేడ్ హాలిడేగా గుర్తించాలని సిఇసి వికాస్ రాజ్ అన్ని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.