HCA కి షాకిచ్చిన హైకోర్టు.. 17.5 కోట్లు విసాక ఇండస్ట్రీస్ కి చెల్లించాలని ఆదేశం..!

-

విసాక ఇండస్ట్రీస్‌కు ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్‌సీఏకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ – విసాక ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌న‌ు హెచ్‌సీఏ క్యాన్సల్ చేసింది. దీంతో విసాక ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది. 

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విసాక ఇండస్ట్రీస్‌కు 18 శాతం యానువల్ ఇంటరెస్ట్‌తో రూ.25 కోట్లు చెల్లించాలని 2016లోనే కోర్టు ఆదేశించింది. అయితే విసాక ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్‌సీఏ ప్రాపర్టీస్‌ను, బ్యాంక్ అకౌంట్స్‌ను 2022 అక్టోబర్‌లో కమర్షియల్ కోర్టు అటాచ్ చేసింది. ఈ క్రమంలో బాంక్ అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలని హైకోర్టులో హెచ్‌సీఏ అప్పీల్ చేసింది. ఆరు వారాల్లోగా రూ.17.5 కోట్లు విసాక ఇండస్ట్రీస్‌కు చెల్లించాలని హెచ్‌సీఏ‌కు హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news