ప్రస్తుతం ఇండియాలోని ఎక్కువ శాతం మంది క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇండియా మ్యాచ్ జరిగినా వేళ్ళు ప్రత్యక్షముగా తిలకిస్తున్నారు. ఇక ఇండియాలో అక్టోబర్ 5 నుండి వన్ డే వరల్డ్ కప్ కూడా జరగబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా క్రికెటర్ మరియు కీపర్ దినేష్ కార్తీక్ ఒక మంచి ప్రతిపాదనను ఇండియా ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చాడు. క్రికెట్ ను జాతీయ క్రీడగా ప్రకటించాలని తన కోరికను బయటపెట్టాడు. కాగా దినేష్ కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఇండియా మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా మద్దతు పలకడం విశేషం. అయితే వీరిద్దరికి మాత్రమే కాదు దేహసంలో చాలా మందికి మనసులో క్రికెట్ ను జాతీయ క్రీడగా ప్రకటించాలని కోరుకుంటూ ఉంటారు.
కానీ దీనిని చెప్పడానికి ఒక వేదిక రాలేదు. ఇప్పుడు దినేష్ కార్తీక్ మొదలుపెట్టిన ఈ విషయాన్ని త్వరలోనే జరగాలని.. ఇందుకు ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలని కోరుకుందాం.