నాగార్జునసాగర్ డ్యామ్ కు పోటెత్తుతున్న వరద.. 18 గేట్లు ద్వారా నీటి విడుదల

-

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి వరకు 20కిపైగా గేట్లు ఎత్తిన నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం 18 గేట్ల ద్వారా నీళ్లను వదులుతున్నారు. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం సాగుతుండటంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.

డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ఇక నాగార్జునసాగర్‌ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 308.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,87,027 క్యూసెక్కులుగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 576 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 391 క్యూసెక్కులు ఉంది. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 14.848 టీఎంసీలుగా ఉంది. మరోవైపు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news