రేపే రైతులకు రుణ మాఫీ.. అర్హులు ఎవరంటే?

-

ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గురువారం (జులై 18వ తేదీ) న తొలి విడతగా లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం 8వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. రేషన్‌ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపారు. రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.

‘రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలే. రేషన్‌కార్డులు లేని 6 లక్షల 36 వేల మందికి అన్యాయం జరగదు. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది.  గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ నిధులను రైతు రుణమాఫీకే వాడాలి. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు అలానే చేస్తాం. రుణమాఫీ లబ్ధిదారులను రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలి.’ అని ముఖ్యమంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news