BREAKING: కేటీఆర్ పై రాళ్ల దాడి కేసులో 23 మంది అరెస్ట్

-

BREAKING: కేటీఆర్ పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై రాళ్ల దాడి కేసులో 23 మందిని అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ… కేటీఆర్ పై రాళ్ల దాడి కేసులో 23 మందిని అరెస్ట్ చేశామని… సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారాలు చేసే వాళ్లపై కఠిన చర్యలు తప్పవు అన్నారు.

23 people arrested in case of stone attack on KTR

కాగా భైంసాలో కేటీఆర్ రోడ్డు షోలో ముసుగులు వేసుకొని వచ్చి రాళ్ళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. భైంసా లో కేటీఆర్ పై దాడి ఘటనపై మాజీ మంత్రి జోగు రామన్న కామెంట్స్ చేశారు. ఓటమి భయంతోనే దాడికి పాల్పడ్డారని…ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు రేపి లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది, కేటీఆర్ పై దాడి పతకం ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version