తెలంగాణలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం… తెలంగాణలో 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు తేలింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేలో ఒక కోటి 42 లక్షల 78వేల 723 ఇళ్లకు వెళ్లి…ఈ లెక్కలు తేల్చారట ఆరోగ్య శాఖ అధికారులు. ఇక అందులో 2 లక్షల 65వేల 324 జ్వరాలు ఉన్నట్టుగా గుర్తించారట అధికారులు. ఇక అదే సమయంలో.. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు లేక ఒకే బెడ్ పైన ఇద్దరికి వైద్యం అందిస్తున్నారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారట.