తెలంగాణ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. 4 రోజులు సెలవులు..!

-

ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే… కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో తెలంగాణలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం… విద్యాసంస్థలకు మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్నయం ప్రకారం ఈ నెల 26వ తేదీ బుధ వారం, 27వ తేదీ గురువారం వర్షం కారణంగా సెలవులు ఇచ్చారు. 29వ తేదీ జనరల్ హాలిడే ఉండనుందట. 30వ తేదీ ఆదివారం కానుంది. దీంతో మొత్తం 4 నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version