మునుగోడులో TRSలోకి వలసలు..కారెక్కిన 5 గ్రామాల సర్పంచ్ లు

-

మునుగోడు ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలోనే.. ప్రతి పక్ష పార్టీలకు ఊహించని షాకులు తగులుతున్నాయి. అటు మునుగోడులో టీఆర్ఎస్ లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఏకంగా… 5 గ్రామాల సర్పంచ్ లు కారెక్కారు.

చండూర్ మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి, గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్, దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మల పల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి లక్ష్మి సైదులు, మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ టీఆర్ఎస్ లో చేరారు.

అలాగే,  మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత సత్యనారయణ గౌడ్ దంపతులు, కిష్టాపురం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం లు టీ. ఆర్. ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ చార్జీ, మంత్రి జగదీశ్వరెడ్డి సమక్షంలో వీరు అధికార పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version