తెరుచుకున్న నాగార్జునసాగర్‌ జలాశయం గేట్లు

-

శ్రీశైలం డ్యామ్ నుంచి భారీగా విడుదలవుతున్న నీటితో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇవాళ జలాశయం 6 గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు డ్యామ్ అధికారులు రేడియల్‌ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపించారు. ముందుగా దిగువప్రాంతాల అప్రమత్తత కోసం మొదటి సైరన్‌ మోగించిన అధికారులు.. మూడో సైరన్‌ తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే సాగర్ గేట్లు తెరుస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలను ముందుగానే అధికారులు అప్రమత్తం చేశారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. వస్తున్న వరద ఇన్‌ఫ్లో 4,41,183 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news