ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనపై దృష్టిని పెట్టింది. హామీల అమలుతో పాటుగా ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపైన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఏపీ చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత కీలక ప్రకటనను విడుదల చేశారు. సంవత్సరంలోగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ద్వారా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి….. ఈ క్రమంలోనే సంవత్సరంలోపు 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. తాజాగా మంగళగిరిలోని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆప్కో దుకాణాల్లో ఉన్న చీరలను పరిశీలించారు. గోదాములలో ఉన్న చేనేత వస్త్రాలను పరిశీలించిన మంత్రి సవిత…. అమ్ముడుపోయినటువంటి చీరలపైన డిస్కౌంట్ ప్రకటించి విక్రయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.