బీజీపీ కి టచ్ లో 8 మంది ఎమ్మెల్యేలు.. 5 గురు ఎంపీలు : బండి సంజయ్

-

తెలంగాణ మాజీ మంత్రి టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు పార్టీ నుంచి బయటికి వస్తే ఆయనను బిజెపిలోకి తీసుకుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బిజెపి సిద్ధాంతాలు నమ్మి ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఎవ్వరైనా సరే బిజెపిలో చేరవచ్చు అని బండి సంజయ్ ఆహ్వానించారు. శుక్రవారం మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ. కెసిఆర్ అహంకారంతోనే టిఆర్ఎస్ పని కథ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికార కాంగ్రెస్ విఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందని అందుకే బిఆర్ఎస్ కాములు ఇన్ని బయటపెడుతున్న కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఐ ఎంక్వయిరీ కి డిమాండ్ చేసిందని అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఉంటే కేసిఆర్ కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని ఆ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news