32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలతో తనను ప్రేమించాలని లేదంటే మీ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బాలికలకు అసభ్యకర మెసేజులు పంపాడు 9వ తరగతి బాలుడు. ఈ తరుణంలోనే బాలుడిపై పోక్సో కేసు నమోదు నమోదు అయింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలుడు 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలతో అదే పాఠశాలలో చదువుతున్న బాలికలకు అసభ్యకర మెసేజులు పంపేవాడు అని పోలీసులు గుర్తించారు.

తనను ప్రేమించాలని లేదంటే మీ నెంబర్లు, ఫొటోలు, వీడియోలను అందరికీ పంపిస్తానని బాలికలను బెదిరించాడు. విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసినా మందలించకపోగా, ప్రోత్సహించడంతో పాటు బాలికలను బాలుడి తల్లి, కౌన్సిలర్ బెదిరించారని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైనర్ బాలుడు, అతని తల్లిదండ్రులు కౌన్సిలర్ నలుగురిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.