హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద BMW కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ ఫాస్ట్ ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతివేగంతో ఢీ కొట్టిన కారు… ఆ తర్వాత… బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో కారు టైర్, ఆయిల్ ట్యాoకర్ పగిలిపోయాయి. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.
కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచు కోవడం తో కారు దిగి పరారయ్యాడు డ్రైవర్. అటు సంఘట నా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో కారు రిజి స్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కారుపై పెండింగ్ లో రెండు చలాన్లు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం
ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతివేగంతో ఢీకొట్టిన కారు
అదుపుతప్పి డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో పగిలిన కారు టైర్, ఆయిల్ ట్యాంకర్
మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు
కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో… pic.twitter.com/wUQPPGVCPj
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2025