A boy named Tillu has gone missing in Jillelaguda in the city of Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో మరో కిడ్నాప్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ మహా నగరంలోని జిల్లెలగూడలో టిల్లు అనే బాలుడు అదృశ్యం అయ్యాడు. ట్యూషన్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు…. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

సిసి ఫుటేజ్ లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://x.com/TeluguScribe/status/1820302432972476648