కల్లు సీసాలో చచ్చిన బల్లి ప్రత్యక్షం..!

-

సాధారణంగా కల్లు సేవించే రాష్ట్రంలో అధికంగానే ఉంటారు. కానీ స్వచ్ఛమైన కల్లు అమ్మే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే స్వచ్ఛమైన చెట్టు కల్లు లభిస్తుంది. తాటి, ఈత, కర్జూర వంటి చెట్ల కల్లు పల్లెటూర్లలో లభిస్తుంది. కల్లు సేవిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు. కానీ కొంత మందికి మాత్రం గ్యాస్ సమస్య తలెత్తే అవకాశముంది.

అదే కల్తీ కల్లు తాగితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. అలాంటిది తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఒకటో నెంబర్ కల్లు దుకాణంలో కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షం అయింది. సగం కల్లును తాగిన తర్వాత కల్లు ప్రియుడు బల్లిని గుర్తించాడు. నిలదీసినా ఇది కామన్ అంటూ లైట్ తీసుకున్న దుకాణదారులు. దీంతో ఏం చేయాలో అతనికి తెలియక ఆ కల్లు సీసాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news