పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు

-

హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అమాయక ప్రజల ప్రాణాలకు.. ప్రాణాంతక వ్యాధులకు కారకులు అవుతున్నారు. ఏ హోటల్ లో చూసిన నాసి రకం ఫుడ్.. నాణ్యత లేకపోవడం.. కుళ్లిపోవడం చాలా రోజులుగా క్లీన్ గా లేకపోవడం ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో
ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసం గుర్తించారు. పాడైపోయిన ఫ్రిజ్‌లో వండిన వంటకాలు గుర్తించారు. పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌లో కూడా అధికారుల తనిఖీలు నిర్వహించారు. అందులో పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్‌ గుర్తించారు. ఇక కాటేదాన్‌లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు చేపట్టారు. భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్‌ కంపెనీల్లో సోదాలు చేసారు. వంట నూనె తయారీలో నిబంధనలు పాటించడం లేదు కంపెనీలు.నిల్వ ఉంచిన రా మెటీరియల్‌లో పురుగులు ఉండటం గమనార్హం. అందుకే బయటి ఫుడ్ కి చెక్ పెట్టి.. ఇంటి ఫుడ్ ను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news