వంటిట్లో ఒక్కసారిగా బ్లాస్ట్…క్షణంలోనే మిస్ !

-

ఇంత వరకు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భారీ పేలుడుకు సంబంధించిన భయానక వీడియో వైరల్ గా మారుతుంది. అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అవగానే ఓ మహిళ సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

A gas cylinder leaked and exploded in an unprecedented manner
A gas cylinder leaked and exploded in an unprecedented manner

అప్పటికే గ్యాస్ పూర్తిగా లీకైన తర్వాత ఓ మహిళతో పాటు మరో యువకుడు దానిని సరి చేయడానికి ఇంట్లోకి వెళ్లారు. వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లిన వెంటనే కిచెన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి ఊహించిన విధంగా బ్లాస్ట్ అయింది.

దీంతో వెంటనే వారిద్దరూ ఇంట్లో నుంచి చెరొక వైపు పరుగులు పెట్టారు. ఇదంతా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ ఘటన ఎక్కడ జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news