తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిన్న, పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి హైడ్రా కాపాడుకొస్తుంది. ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ హైడ్రా వార్తల్లోకి ఎక్కుతుంది. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజాము పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా.. ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీట్ ఎక్కింది. గురువారం తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు మధ్య చాంద్రాయణ గుట్ట లోని అక్బర్ నగర్లో ఆక్రమ కట్టడాలను కూల్చివేతలు ప్రారంభించింది.
ఈ సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేసుకొని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
అనంతరం స్థానికులు హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాకు, రంగనాథకు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేశారు. దీంతో
అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.