చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. భూమి కోసం 20 రోజుల క్రితం ఈశ్వరమ్మ మామ నాగన్న హత్యకు గురయ్యారట. కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.
చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.. ఈ నెల 3న ఈశ్వరమ్మ చిన్నమామ కాట్రాజు నాగన్న (56)కు చెందిన 2.5 ఎకరాల భూమిని బండి వెంకటేష్ ఎకరా రూ. 20 లక్షలు పలుకుతుండగా రూ. 4.5 లక్షల చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అందుకు నాగన్న ఒప్పుకోకపోవడంతో గ్రామ శివారులో హత్య చేయగా పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారు.. భూతగాదా నేపధ్యంలో ఆయన్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..