రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి : రాహుల్ గాంధీ

-

రాజకీయాల్లోకి అంతా కొత్త జనరేషన్ రావాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ HICC జరుగుతున్న భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. పదేళ్ల నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవు అని.. పదేళ్ల క్రితం పని చేసినవి ఇప్పుడు పని చేయడం లేదు. పాతతరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడు అంతా మోడ్రన్ రాజకీయమే అన్నారు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారత్ జోడో యాత్రలో 4వేల కిలో మీటర్లు నడిచాను.

కన్యాకుమారి నుంచి జోడో పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు.  జోడో యాత్రలో ప్రజలు సమస్యలు తెలుసుకున్నానని.. ప్రజల సమస్యలు విన్నానని వివరించారు. 10 రోజుల తరువాత నాతో నడిచేవారి సంఖ్య పెరిగిపోయింది. సగం దూరం నడిచే సరికి తాను గతంలో మాదిరిగా లేను. గతంలో నేను ఎప్పుడు ప్రజలపై నాకు ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు. కానీ జోడో యాత్ర ద్వారా తనకు ఉన్న ప్రేమను ప్రజలపై వ్యక్త పరిచినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news