ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం

-

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ మోంటింగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు.

ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200 వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు.

ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వానంలో తెలిపారు. అలాగే ఈ 19వ ప్రపంచ సదస్సుకు మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు కూడా ఆహ్వానం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news