వరదలపై అసత్య ప్రచారం వెనుక వైసీపీ కుట్ర – మంత్రి నారాయణ

-

ఆదివారం మరోసారి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు మంత్రి నారాయణ. విజయవాడలోని కండ్రికలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఇళ్లల్లోకి వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వరద ప్రాంతాలలో పరిస్థితి మెరుగుపడిందని అన్నారు.

ఇళ్ళను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే విజయవాడలో మళ్లీ వరదలు వస్తున్నాయని జరిగిన ప్రచారం వెనుక వైసిపి కుట్ర ఉందని ఆరోపించారు నారాయణ. వరదలపై అసత్య పోస్టుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చంద్రబాబు పాలన చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. వైసిపి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు అన్నారు నారాయణ. ఎవరైనా విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుడమేరులో ఆక్రమణలు ఉంటే వాటిని తొలగిస్తామని.. అందులో పేదవారు ఉన్నా వారికి ఇబ్బందులు లేకుండా టిడ్కో ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news