కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం

-

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఉన్నారు. ఇక ఆ తరువాత సికింద్రాబాద్ ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయంసాధించారు. అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి అయిన తరువాత కిషన్ రెడ్డి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యున్నత పురస్కారం దక్కింది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడలియన్ అవార్డును ఆయన అందుకున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డికి అవార్డును యూఎస్ ప్రతినిధులు అందజేశారు. పర్యాటక రంగాన్ని, సంస్కృతిని ప్రోత్సహించడంతో దేశఖ్యాతి యూఎస్ వరకే కాకుండా గ్లోబల్ వైడ్ గా వ్యాపించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారని ఆ దేశ ప్రతినిధులు వివరించారు. అంతేకాకుండా ఈ శూన్య రాష్ట్రాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను కిషన్ రెడ్డికి ఈ పురస్కారాన్ని అందించినట్లు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడలియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రాజకీయ నేతగా కిషన్ రెడ్డి నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version