ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. కమిన్స్ కి రూ.20.50 కోట్లు

-

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్ వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం ఎస్ఆర్ హెచ్ , ఆర్ సీబీ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. గతంలో అతడు కోల్ కతా తరపున ఆడారు. కాగా ఇప్పటివరకు అత్యధిక ధర సామ్ కరణ్ రూ.18.50 కోట్ల రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ మినీ వేలంలో SRH ముగ్గురు విదేశీ ప్లేయర్లను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో పాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. రూ.20.5 కోట్లు కుమ్మరించి అతన్ని దక్కించుకుంది. ట్రావిస్ హెడ్, వనింద్ హసరంగను కూడా వేలంలో కొనుగోలు చేసింది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 8 మంది విదేశీ ప్లేయర్లున్నారు. ఫజల్లా ఫరూఖీ, మార్కో జాన్సెన్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, అయిడెన్ మార్క్రమ్, కమిన్స్, హెడ్, హసరంగ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news