నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం..!

-

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో  వరుస హత్యల కలకలం సృష్టిస్తున్నాయి.  15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. 15రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య, వివిధ ప్రాంతాల్లో మృత దేహాలు పారేసాడు ఈ నర హంతకుడు. సదా శివ నగర్ లో గుర్తు తెలియని మహిళ మృత దేహం లభ్యం కావడం తో తీగ లాగితే డొంక అంతా కదిలింది.

బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపం లో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మాచా రెడ్డి లో మరొకరి మృత దేహం లభ్యం అయింది. ఇక మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తో ఎక్కడ కూడా మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.  ఇంటి కోసమే వరుస హత్యలు చేసినట్లు అనుమానం కలుగుతుంది. మాక్లుర్ కు చెందిన నిందితునిగా గుర్తించారు.  పోలీసుల అదుపులోనే ఉన్నాడు నిందితుడు.

Read more RELATED
Recommended to you

Latest news