అసెంబ్లీలో బీఆర్ఎస్ కి షాక్.. ఆ తీర్మాణం రిజెక్ట్..!

-

రెండు రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ కి షాక్ తగిలిందనే చెప్పాలి. ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగులకు సంబంధించి ఇతర న్యాయపరమైన డిమాండ్ల పై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి వాయిదా తీర్మాణం ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపాదించిన ఈ వాయిదా తీర్మాణాన్ని రిజెక్ట్ చేశారు స్పీకర్. బీఆర్ఎస్ కోరిన అంశాలపై చర్చ జరిపేందుకు స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ వాయిదా తీర్మాణాన్ని రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news