ఈ మధ్య కాలంలో పులులు ఎక్కువగా జనావాసాల మధ్యకు రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు తిరుపతి, అటు నల్లమల్ల ఫారెస్ట్, ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల వంటి ఫారెస్ట్ ఉన్న ప్రాంతాల్లో పులులు ప్రజలను గజ గజ వణికిస్తున్నాయి. ఓ వైపు చలితో వణుకుతుంటే.. పులి భయంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. తాజాగా కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా వాసులను వణికిస్తున్న పెద్ద పులి.
జిల్లాలోని మాకాడి వద్ద రైలు పట్టాలు దాటుతు స్థానికులకు కనిపించింది. పులిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పులి తాపీగా పట్టాలు దాటుతూ ముందుకెళ్లిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం ఇటీవల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో ఓ యువతిపై దాడి చేసి హతమార్చిన పులి.. ఆ తర్వాత రోజునే దుబ్బగూడలో మరో రైతు పై దాడి చేసి గాయపరిచింది. పశువులపై దాడులు కొనసాగిస్తోంది. కొమురం భీమ్ అసిఫాబాద్
జిల్లా సిర్పూర్ (టి) మండలం హుడ్కిలి లో దూడపై దాడి చేసిన పెద్దపులి అనంతరం వెంపల్లి రైల్వే బ్రిడ్జి
వద్ద, మాకిడి రైల్వే క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ కనిపించింది.