ఫార్ములా ఈ రేసింగ్ పై సభలో చర్చించాలని స్పీకర్ ను కోరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హరీశ్ రావు నేతృత్వంలో స్పీకర్ ను కలువనున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ అంశం పై ఇప్పటికే గవర్నర్ విచారణకు ఆమోదం తెలిపినట్టు మొన్న కేబినెట్ భేటీలో చర్చించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేసింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఫార్ములా ఈ రేసింగ్ పై సభలో చర్చ పెట్టాలని కోరుతున్నారు. లీకులు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు హరీశ్ రావు. సభను గౌరవంగా నడపాలన్నారు. కొద్ది సేపట్లోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి మెమొరండం ఇవ్వనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.