బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్ లో ట్విస్ట్‌..హైదరాబాద్ వ్యాపారవేత్తే అసలు సూత్రధారి ?

-

బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్ లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హైదరాబాద్ వ్యాపారవేత్తే అసలు సూత్రధారి అని సమాచారం అందుతోంది. బెంగళూర్ రేవ్ పార్టీపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ వాసు పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరు హెబ్బగోడిలోని జిఆర్ ఫామ్స్‌లో రేవ్ పార్టీ నిర్వహించాడు.

A twist in the Bangalore rave party report

అయితే సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడులు నిర్వహించి 150 మందిని అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొకైన్, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలను సేవిస్తూ పట్టుబడ్డారని సమాచారం అందుతోంది. అటు నటి హేమ రేవ్‌పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. తాను హైదరాబాద్‌లోనే ఉన్ననంటున్నారు హేమ. హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో షూట్‌ చేసిందేన్నంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news