మందుబాబులకు షాక్‌..ఇక తెలంగాణలో కూడా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ !

-

మందుబాబులకు షాక్‌ తగులనుంది. ఇక తెలంగాణలో కూడా బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్స్‌ కనిపించనున్నట్లు సమాచారం. తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని..గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. RR టాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమీషన్లు ఇవ్వాలని ఒత్తిళ్లు కూడా చేస్తున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం.

Boom Boom, President Medal in Telangana too

అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించి గేమ్ ప్లాన్ వేస్తున్నారట. ఈ తరుణంలోనే ఇక నుండి తెలంగాణలో కూడా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ తరహా బ్రాండ్లు కనిపించనున్నాయని చెబుతున్నారు. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు తెరలేపనున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగు కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత ఏర్పరిచి.. ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news