ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సందర్శనకు వెళ్లేవారికి బిగ్ షాక్. లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేశారు. మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేయనున్నారు. నేటి నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని తెలిపారు అధికారులు,పోలీసులు.
మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇక ఈ నిర్ణయంపై పర్యాటకులు సహకరించాల్సిందిగా కోరారు పోలీసులు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు కోళ్లు, మేకలను తీసుకొస్తే ఆర్టీసీ బస్సుల్లోకి అనుమతించమని టీఎస్ఆర్టీసీ ఎండీ సీవీ సజ్జనార్ స్పష్టం చేశారు.