ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లు ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయం మీద అధికంగా ఆధారపడి ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనలో పునర్విభజన చట్టంలో తెలంగాణ 53.89, ఏపీ 46.11 శాతం విద్యుత్ వినియోగం ఉందని.. ఇప్పుడు విద్యుత్ ఉత్పాదనలో కొంత మెరుగుపడ్డామన్నారు. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ సకాలంలో ఉపయోగించుకునేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు.
విద్యుత్ పై కేంద్రం తీసుకు వస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. రామగుండంలో సబ్ క్రిటికల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ను మూసివేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదన్నారు. కేవలం 9, 10 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. లోడ్ ఎక్కువ పడుతుందని.. దింతో ట్రాన్స్ ఫార్మర్స్ బాగా కాలిపోతున్నాయన్నారు. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల, కరీంనగర్, తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. జనవరి 2022 నుంచి విద్యుత్ సరఫరా వివరాలు ఇవ్వలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వము అని కామారెడ్డి జెడ్పి తీర్మానం చేసి పంపారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని చట్టం తేవడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల్లో ఒక జగిత్యాలలోనే 300 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.