ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే రచ్చబండ కార్యక్రమం రద్దు ఐంది. ఇవాళ ఉదయం 11 గంటలకు RRBHR గ్రౌండ్ హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
11.15 గంటలకు ఉప్పాడ-కొత్తపల్లి మండలంలో వివిధ దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొ0టారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం టౌన్ అంబేద్కర్ భవన్ లో రైతులకు పనిముట్లు, మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవాలు ఉంటాయి. 12.30 గంటలకు పిఠాపురం టౌన్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూ టీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం హెలికాప్టర్ ద్వారా పిఠాపురం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరు కోనున్నారు పవన్ కళ్యాణ్.