తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వచ్చే ఎన్నికల్లో ప్రజలను మరోసారి ఆకట్టుకునేలా మెనీఫెస్టో రూపకల్పనపై CM KCR కసరత్తు చేస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వికలాంగుల పింఛన్ ను రూ.3,016 నుంచి రూ.4.016 పెంచగా, వృద్ధుల, వితంతువుల పెన్షన్ ను రూ.2,016 నుంచి రూ.3,106 పెంచనున్నట్లు పేర్కొంటున్నారు. గృహలక్ష్మి, దళిత బంధు పథకాల పరిధిని విస్తరిస్తారని సమాచారం. విపక్షాలకు ధీటుగా కొత్త పథకాలను మెనీ ఫెస్టోలో చేర్చుతారని తెలుస్తోంది.
అటు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. విధివిధానాల ఖరారుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షునిగా కమిటీని సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉంటారు.